News10th Nov 12:19 PMSunil Byrisetty1 min read
వర్షపు నీటిని ఒడిసి పడదాం.. జీవనాధారం పెంచుదాం
వర్షపు నీటిని ఒడిసి పడదాం.. జీవనాధారం పెంచుదాం అని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్ పై రెండు రో
వర్షపు నీటిని ఒడిసి పడదాం.. జీవనాధారం పెంచుదాం అని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్ పై రెండు రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్లో సోమవారం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులో మూడవ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుందని, ముఖ్యమంత్రి మంచి విజన్ తో ఆ పథకాలను చక్కగా ఉపయోగించుకుని దేశంలోనే ఆదర్శంగా ఉండాలని, ముందు వరసలో నిలబడాలనే ఆశయంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. నీటి భద్రత - జాతీయ భద్రతగా ప్రధాని పరిగణిస్తున్నారని తెలిపారు. ఇందుకుగాను వాటర్ షెడ్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.