News25th Apr 12:33 PMSunil Byrisetty1 min read
అభివృద్ధిలో అగ్రస్థానంలో కృష్ణా..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 11 నెలల్లోనే కృష్ణాజిల్లా అన్ని రంగాల్లో, అన్ని శాఖల్లో ముందంజలో ఉందని ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 11 నెలల్లోనే కృష్ణాజిల్లా అన్ని రంగాల్లో, అన్ని శాఖల్లో ముందంజలో ఉందని ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.
వేసవిలో గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక భరోసా ఈనెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విడుదల చేయటం జరుగుతుందన్నారు.
మచిలీపట్నం పోర్టును 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు రోడ్ల ఇరువైపులా పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రక్షిత మంచినీటి పథకాల ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేసి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సూచించారు.
ధాన్యం సేకరించే సమయంలో ఇబ్బందులు ఉన్నాయని పరిష్కార మార్గంగా ప్రతి మిల్లులో డ్రైయర్ ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు