News3rd Jun 06:54 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో మోడ‌ల్ క‌లెక్ట‌రేట్‌గా తీర్చిదిద్దుదాం

ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌లందించ‌డంతో పాటు ప‌రిపాల‌న‌, ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త వంటి విష‌యాల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌ను మోడ‌ల్ క‌లెక్ట‌రేట్‌గా త

రాష్ట్రంలో మోడ‌ల్ క‌లెక్ట‌రేట్‌గా తీర్చిదిద్దుదాం
ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌లందించ‌డంతో పాటు ప‌రిపాల‌న‌, ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త వంటి విష‌యాల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌ను మోడ‌ల్ క‌లెక్ట‌రేట్‌గా తీర్చిదిద్ద‌డంలో అధికారులు ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో చేప‌ట్టాల్సిన సంస్క‌ర‌ణ‌లు, ప్రాంగ‌ణం అభివృద్ధి, ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌తపై మంగ‌ళ‌వారం కలెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి ప్రాంగ‌ణాన్ని ప‌రిశీలించారు. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ పురాతన కాలం నాటి క‌ట్టడ‌మైన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం సంద‌ర్శ‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంటోంద‌న్నారు. ఒక‌ప్ప‌టి స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఏర్ప‌డి నూరు వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భ‌గా ఏర్పాటుచేసిన స్తూపం స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత తెలియ‌జేసేలా రంగుల‌తో తీర్చిదిద్ది అలంక‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. స్తూపం చుట్టూ ఉన్న స్థ‌లంలో ఔష‌ధ మొక్క‌లు నాటి, సంర‌క్షించి, అత్యంత సుంద‌రంగా తీర్చిదిద్దాల‌న్నారు.
Andhra Pradesh news
Vijayawada
Dr. G.Lakshmisha
Collectorate office
greenery and cleanliness
రాష్ట్రంలో మోడ‌ల్ క‌లెక్ట‌రేట్‌గా తీర్చిదిద్దుదాం
Scroll for the next article