News20th Nov 04:31 PMSunil Byrisetty1 min read
ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా కలిసి పనిచేద్దాం
ఆధునిక సాంకేతికతతో వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ భవిష్యత్ కు బాటలు వేసేలా మానవవనరులను తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) ఎస్. శాంతి ప్ర
ఆధునిక సాంకేతికతతో వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ భవిష్యత్ కు బాటలు వేసేలా మానవవనరులను తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) ఎస్. శాంతి ప్రియ తెలిపారు. విజయవాడలోని స్టాలిన్ బిల్డింగ్ 8వ అంతస్తులోని మల్టీపర్పస్ హాల్ లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) ఎస్. శాంతి ప్రియ చేతుల మీదుగా 5 వ ఆడిట్ దివస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆమె మాట్లాడుతూ అధునాతన సాంకేతికతలైన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సేవలను పరిపాలనలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా ప్రజా వనరులను సక్రమంగా వినియోగిస్తూ పనిచేయాలన్నారు. సమాజంలో సమున్నత మార్పులకు నాయకత్వం వహించడం, విలువలు పునరుద్ఘాటించడం, విశ్వాసం, ఆవిష్కరణ, సుస్థిరత, జవాబుదారీతనం లక్ష్యంగా పనిచేయాలన్నారు. పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనంలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్) పాత్రను, చేస్తున్న కృషిని వివరించారు. కాగ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ ప్రధానమైన ఆడిట్ బాధ్యతతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అకౌంట్స్, ఎన్ టైటిల్ మెంట్స్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు.