Electronics9th Aug 02:55 PMSunil Byrisetty1 min read
లైట్ వెయిట్‌లో ఎల్‌జీ గ్రామ్ అల్ట్రా
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ అతి తక్కువ బరువులో సరికొత్త ల్యాప్ టాప్‌ను విడుదల చేయనుంది. ఈ ల్యాప్ టాప్ కేవలం కిలోన్నర బరువు మాత్రమే ఉండటం విశేషం. ఎల్‌జీ గ్రామ్ 17 (2025) మోడల
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ అతి తక్కువ బరువులో సరికొత్త ల్యాప్ టాప్‌ను విడుదల చేయనుంది. ఈ ల్యాప్ టాప్ కేవలం కిలోన్నర బరువు మాత్రమే ఉండటం విశేషం. ఎల్‌జీ గ్రామ్ 17 (2025) మోడల్ ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ కానుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7, 17-అంగుళాల WQXGA డిస్‌ప్లేతో 1.5 కేజీ బరువులో ఈ ల్యాపీ ఆకట్టుకోనుంది. 16GB RAM, 1TB SSDతో ప్రొఫెషనల్స్‌కు అనువైన ఎంపిక అని చెప్పవచ్చు. 20 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ దీనికి అదనపు ఆకర్షణ. ఈ ల్యాపీ AI-ఆధారిత ఫీచర్లతో వస్తుంది. ధర రూ.1,95,000 నుంచి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్ లైట్‌వెయిట్ డిజైన్‌లో టాప్ ఎంపికగా నిలుస్తుందని చెప్పవచ్చు.