News5th Sep 01:34 PMSunil Byrisetty1 min read

బతుకు బండి భారం.. వినూత్న నిరసన

నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు ప్ర‌తి కుటుంబాన్ని తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తున్నాయి. ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌డంతో ఏమీ కొన‌లేని నిస్స‌హాయ స్థితి. మ‌రోవైపు ఆదాయం క‌రువై, కుటుంబ పోష‌ణ భ

బతుకు బండి భారం.. వినూత్న నిరసన
నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు ప్ర‌తి కుటుంబాన్ని తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తున్నాయి. ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌డంతో ఏమీ కొన‌లేని నిస్స‌హాయ స్థితి. మ‌రోవైపు ఆదాయం క‌రువై, కుటుంబ పోష‌ణ భార‌మ‌వుతోంది.ఈ నేప‌థ్యంలో నిత్యావ‌స‌ర స‌రకుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ తిరుప‌తిలో వైసీపీ ఆధ్వర్యంలో వినూత్న నిర‌స‌న చేప‌ట్టారు. గ‌త రెండేళ్ల‌లో వివిధ నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు సంబంధించి ఫ్లెక్సీల‌తో కూడిన బండిని ఈడ్చుతూ న‌గ‌రంలో వినూత్నంగా నిర‌స‌న చేప‌ట్టారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ బ‌తుకు బండి భార‌మైంద‌ని విమ‌ర్శించారు. చ‌క్కెర తీపి త‌ప్ప‌, దాని ధ‌ర మాత్రం చేదైంద‌ని ఆయ‌న వాపోయారు. చికెన్ , బియ్యం, పెట్రోల్‌, డీజిల్‌, వివిధ ర‌కాల పప్పుల ధ‌ర‌లు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయ‌న్నారు. సామాన్య ప్ర‌జ‌ల ఇబ్బందులు కూట‌మి ప్ర‌భుత్వానికి ఏ మాత్రం అవ‌స‌రం లేకుండా పోయాయ‌న్నారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు స‌ర్కార్ జోక్యం చేసుకుని నిత్యావ‌స‌ర స‌రుకుల్ని త‌క్కువ రేటుకే పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు.
Andhra Pradesh Politics
Tirupati Protest
YSRCP
Rising Prices
Essential Commodities
Price Rise
Cost of Living
Chandrababu Naidu
పెట్రోల్ ధరలు
డీజిల్ ధరలు
బియ్యం ధరలు
పప్పుల ధరలు
చక్కెర ధరలు
చికెన్ ధరలు
ద్రవ్యోల్బణం
Scroll for the next article