Politics11th Mar 02:43 PMSunil Byrisetty1 min read

అసెంబ్లీలో లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లు

అసెంబ్లీలో లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లు 2025ను మంత్రి గొట్టిపాటి రవి ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పట్టణీకరణ, బహుళ అంతస్తుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని బిల్లుపై చర్చ సందర్భంగా పేర

అసెంబ్లీలో లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లు
అసెంబ్లీలో లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లు 2025ను మంత్రి గొట్టిపాటి రవి ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పట్టణీకరణ, బహుళ అంతస్తుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని బిల్లుపై చర్చ సందర్భంగా పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల భద్రత చాలా కీలకమన్నారు. కొత్త బిల్లు వల్ల లిఫ్టులు, ఎస్కలేటర్ల ప్రమాదాలు కట్టడి చేయవచ్చని తెలిపారు. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‍లో భాగంగా ఇప్పటికే కేంద్రం బిల్లు తీసుకొచ్చిందని చెప్పారు. 15 రాష్ట్రాలు ఇప్పటికే లిఫ్టులు, ఎస్కలేటర్ల చట్టం అమలు చేస్తున్నాయని వివరించారు. పూర్తి అధ్యయనం తర్వాత ఈ బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Lift And Escalator Bill
Assembly
Minister Gottipati Ravi
మంత్రి గొట్టిపాటి రవి
లిఫ్టులు
Scroll for the next article