News9th Oct 12:23 PMSunil Byrisetty1 min read
తృటిలో తప్పిన పిడుగు ప్రమాదం
పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి వద్ద పెనుప్రమాదం తృటిలో తప్పింది. పిడుగుపడటంతో ఒక్కసారిగా విరిగి ఆర్టీసీ బస్సుపై విద్యుత్ స్తంభం పడింది. అదే సమయంలో కరెంట్ లేకపోవడంతో ప్రయాణిక
పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి వద్ద పెనుప్రమాదం తృటిలో తప్పింది. పిడుగుపడటంతో ఒక్కసారిగా విరిగి ఆర్టీసీ బస్సుపై విద్యుత్ స్తంభం పడింది. అదే సమయంలో కరెంట్ లేకపోవడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.
కరెంటు స్థంభం పడటంతో ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. కరెంటు పోల్ పడటంతో అమరావతి - గుంటూరు రహదారిపై కాసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. అధికారులు వచ్చి సహాయ చర్యలు చేపట్టడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.