Crime18th Aug 11:53 AMSunil Byrisetty1 min read

పుష్ప స్టైల్లో లారీ క్యాబిన్లో మద్యం బాటిళ్లు

తాడిపత్రిలో పుష్ప స్టైల్లో మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. గోవా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠా గుట్టును తాడిపత్రి పోలీసులు రట్టు చేశారు. లారీ క్యా

పుష్ప స్టైల్లో లారీ క్యాబిన్లో మద్యం బాటిళ్లు
తాడిపత్రిలో పుష్ప స్టైల్లో మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. గోవా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠా గుట్టును తాడిపత్రి పోలీసులు రట్టు చేశారు. లారీ క్యాబిన్‌లో ఏర్పాటు చేసిన సీక్రెట్ బాక్స్‌లో దాచిన 400కు పైగా గోవా మద్యం ఫుల్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రిలో ఓ లారీ క్యాబిన్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ బాక్స్‌ను గుర్తించారు. బాక్స్‌ను తెరిచి పరిశీలించగా అందులో 400కు పైగా గోవా మద్యం ఫుల్ బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.మద్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. గోవా నుంచి మద్యం ఎక్కడి నుంచి బయలుదేరింది? తాడిపత్రికి చేరుకునే క్రమంలో ఎక్కడెక్కడ ఆగింది? స్థానికంగా ఎవరికి సరఫరా చేయాల్సి ఉంది? ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Andhra Pradesh
Police Seizure
Tadipatri
Illegal Liquor Transport
Goa Liquor
Liquor Smuggling
Lorry
లారీ
సీక్రెట్ బాక్స్
ఎక్సైజ్
అక్రమ మద్యం వ్యాపారం
Scroll for the next article