News5th Apr 09:33 AMSunil Byrisetty1 min read

తగ్గిన మద్యం ధర.. పెరిగిన అమ్మకాలు!

ఏపీలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో పొరుగునున్న తెలంగాణను సైతం దాటేసి దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు ఏ

తగ్గిన మద్యం ధర.. పెరిగిన అమ్మకాలు!
ఏపీలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో పొరుగునున్న తెలంగాణను సైతం దాటేసి దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు ఏకంగా రూ.30 వేల కోట్లు దాటాయి. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రావడం, రూ.99 మద్యం అందుబాటులోకి రావడంతో వినియోగదారులు పెరిగారని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ సగటున రూ.83 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 2023-24లో రూ.30 వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే, 2024-25లో ఈ సంఖ్య 9.1% పెరిగింది. జిల్లాల వారీగా మద్యం అమ్మకాలు : 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గగా, కొన్ని ప్రధాన నగరాల్లో అమ్మకాలు భారీగా పెరిగాయి. కర్నూలు జిల్లాలో 13.63% మద్యం అమ్మకాలు పెరుగుదల నమోదు చేయగా.. చిత్తూరు, శ్రీ సత్యసాయిల్లోనూ భారీగా పెరిగాయి. ఇక అనకాపల్లి జిల్లాలో 1.77% తగ్గుదల కనిపించగా.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, నెల్లూరు జిల్లాల్లోనూ స్వల్పంగా అమ్మకాలు తగ్గినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆదాయంలో కీలకపాత్ర పోషిస్తున్న మద్యం విక్రయాలతో 2023-24లో రూ.25,082 కోట్ల ఆదాయం సమకూరింది. కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం దరఖాస్తు రుసుముల ద్వారా రూ.1,800 కోట్లు ఆదాయం పొందింది.
Andhra Pradesh
Liquor Sales Growth
Liquor Rates
Scroll for the next article