Telangana6th Dec 09:05 AMSunil Byrisetty1 min read

చలి విరుగుడు మందే.. రూ. 600 కోట్ల సేల్స్!

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ చలి వాతావరణంలో మద్యం ప్రియులు విరుగుడుగా మందు వేస్తున్నారు. చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం నాలుగు

చలి విరుగుడు మందే.. రూ. 600 కోట్ల సేల్స్!
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ చలి వాతావరణంలో మద్యం ప్రియులు విరుగుడుగా మందు వేస్తున్నారు. చిల్డ్ బీర్లు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది నాలుగు రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడవ్వగా.. ఇప్పుడు ఏకంగా 107 శాతం పెరిగాయి. దాదాపు 600 కోట్ల రూపాయల మద్యం కొని తాగేశారు. డిసెంబర్ 1వ తేదీనుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి. రెండేళ్లలో 724 లక్షల కేసుల లిక్కర్‌, 960 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. 2024 జనవరి నుంచి డిసెంబరు వరకు రూ.37,485 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు రూ.29,766 కోట్ల అమ్మకాలు జరిగాయి.
Telangana
Liquor Sales
Beer Sales
Winter Effect
Alcohol Consumption
Revenue Report
మార్కెట్ ట్రెండ్స్
ఆల్కహాల్ ఇండస్ట్రీ
బీర్ సేల్స్
Scroll for the next article