Politics24th Aug 02:51 PMSunil Byrisetty1 min read

రోలెక్స్ వాచీలు.. రేంజ్ రోవర్.. కోర్టుకు కారుమూరి!

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును మద్యం రవాణా కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను నాంపల్లిలోని ఈడీ కోర్టుకు తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్‌క

రోలెక్స్ వాచీలు.. రేంజ్ రోవర్.. కోర్టుకు కారుమూరి!
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును మద్యం రవాణా కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను నాంపల్లిలోని ఈడీ కోర్టుకు తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్‌కుమార్ అరెస్టయ్యారు. అలాగే వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మద్యం రవాణా కాంట్రాక్టులో భారీగా అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. రవాణా ధరను కిలోమీటర్‌కు రూ.13 నుంచి రూ.35కు పెంచినట్లు గుర్తించిన ఈడీ సుమారు రూ.195.33 కోట్ల మేర అక్రమ లబ్ధి పొందినట్లు పేర్కొంది. సునీల్‍కుమార్ ఇంట్లో రోలెక్స్ వాచీలు, రేంజ్ రోవర్ స్వాధీనం చేసుకున్నారు. హవాలా లావాదేవీల్లో కారుమూరికి రూ.15 కోట్లు చేరినట్లు సమాచారం సేకరించారు.
Andhra Pradesh politics
Karumuri Nageswara Rao
ED
Enforcement Directorate
Liquor Transport Case
Liquor Scam
ED Court
Nampally Court
Sunil Kumar
Vasudeva Reddy
రేంజ్ రోవర్
హవాలా లావాదేవీలు
అక్రమ లాభం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఏపీ న్యూస్
Scroll for the next article