News17th Jun 11:00 AMSunil Byrisetty1 min read

చెట్టుకు కట్టేసి మహిళపై దాడి.. సీఎం సీరియస్!

కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై ఇప్పటి

చెట్టుకు కట్టేసి మహిళపై దాడి.. సీఎం సీరియస్!
కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అతని భార్య శిరీష నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు రాగా.. మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకొని.. భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టుకు కట్టి దాడి చేయగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Andhra Pradesh news
Chittoor
kuppam
Loan lenders
Tie women to a tree
CM Chandrababu
Social Media
అప్పు తీర్చలేదని ఓ మహిళను పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసి
ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు
Scroll for the next article