Politics27th Mar 12:21 PMSunil Byrisetty1 min read

ఏపీలో ఉప ఎన్నికల వేడి.. 9 చోట్ల పోటాపోటీ..

రాష్ట్రంలో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. పలు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు అధికార, ప్రతిపక్షాలు తలపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల వైసీపీ నేతలు ఎన్డీయే కూటమి

ఏపీలో ఉప ఎన్నికల వేడి.. 9 చోట్ల పోటాపోటీ..
రాష్ట్రంలో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. పలు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు అధికార, ప్రతిపక్షాలు తలపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల వైసీపీ నేతలు ఎన్డీయే కూటమి తీర్ధం పుచ్చుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా క్యాంప్‌ రాజకీయాలకూ తెరలేచింది. రాష్ట్రంలో ఇవాళ 9 చోట్ల స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరగనున్నాయి. క్యాంపులకి వెళ్లిన జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తిరిగొస్తున్నారు.. తీవ్ర ఉత్కంఠ రేపిన కడప జడ్పీ చైర్మన్‌ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండటంతో వైసీపీ ఖాతాలోకి చేరింది. బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా గెలుపొందారు. కాకినాడ రూరల్‌ జనసేన ఖాతాలోకి చేరింది. కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే యలమంచిలి మున్సిపల్ రాజకీయం మలుపు తిరిగింది. ఛైర్ పర్సన్ బీజేపీలో చేరడంతో వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి, నోటీసుపై 19 మంది వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. ఇక కొత్త ఛైర్ పర్సన్ పేరును వైసీపీ ప్రకటించే ఛాన్సులున్నాయి. ఇంకా తిరుపతి రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి, పల్నాడు జిల్లా అచ్చంపేట.. సత్యసాయి జిల్లా రామగిరిలో ఎంపీపీ ఎన్నికలు హీట్ పుట్టి్స్తున్నాయి. కడప జిల్లా గోపవరం ఉపసర్పంచ్‌ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
Local Body
Elections
AP
YCP
TDP
Scroll for the next article