Politics3rd Sep 04:05 PMSunil Byrisetty1 min read

షెడ్యూల్ ప్రకారమే స్థానికం.. మంత్రి క్లారిటీ

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారా లోకేష్ కీలక అప్డేట్ ఇచ్చారు. కోర్టు కేసులతో వాయిదా పడతాయని భావిస్తుండగా.. అదేమీ ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని మం

షెడ్యూల్ ప్రకారమే స్థానికం.. మంత్రి క్లారిటీ
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారా లోకేష్ కీలక అప్డేట్ ఇచ్చారు. కోర్టు కేసులతో వాయిదా పడతాయని భావిస్తుండగా.. అదేమీ ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కోర్టులో పెండింగ్లో వున్న సమస్యలను పరిష్కారించుకొని అక్టోబర్ చివరికల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోతాయని, దాంతో రాష్ట్రం ఆర్ధికంగా నష్టపోతుందన్నారు. వైసీపీ కోర్టు కేసులతో చేస్తున్నకుట్రలను సాగనిచ్చేది లేదన్నారు. అమరావతిలో ఆయన మంత్రులతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల వ్యూహం గురించి సుదీర్ఘంగా సహచర మంత్రులతో చర్చించారు. త్వరలో జరగబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని మంత్రులకు సూచించారు.
Andhra Pradesh Elections
Nara Lokesh
Local Body Elections
AP Local Elections
Amaravati
Local Elections 2026
Panchayat Elections
Municipal Elections
వైసీపీ
ఏపీ ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు
ఎన్నికల వ్యూహం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఏపీ న్యూస్
Scroll for the next article