News17th Oct 05:39 PMSunil Byrisetty1 min read

డ్రోన్ల నిఘాలో స్థానిక ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఐజీ రాజకుమారి తెలిపారు. డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాల ఎస్పీలను అప్రమత్

డ్రోన్ల నిఘాలో స్థానిక ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఐజీ రాజకుమారి తెలిపారు. డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాల వారీగా పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి అతి సున్నిత, సున్నిత, సాధారణ పోలింగ్‌ కేంద్రాలుగా విభజిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు బందోబస్తుతోపాటు మొబైల్‌ పార్టీలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు, ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు, రూట్‌ మొబైల్‌ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు రాజకుమారి వెల్లడించారు.
Scroll for the next article