Politics12th Oct 03:51 PMSunil Byrisetty1 min read
స్థానికంలో 'రిజర్వేషన్ల'కు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'రిజర్వేషన్ల'కు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరానికి అభ్యర్థుల కొరతతో 'వైసీపీ' విలవిలలాడుతోంది. మరోవైపు 'టీడీపీ'లో ఆశ
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'రిజర్వేషన్ల'కు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరానికి అభ్యర్థుల కొరతతో 'వైసీపీ' విలవిలలాడుతోంది. మరోవైపు 'టీడీపీ'లో ఆశావహుల క్యూ పెరిగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికపై సందిగ్ధత నెలకొంది. పోటీకి ముందుకొచ్చే నేతలేరీ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేడర్‌లోనూ నిస్తేజం కనిపిస్తోందనే ప్రచారం ఊపందుకుంది. కీలకమైన గుంటూరు మేయర్ పదవితో పాటు.. తెనాలి, చిలకలూరిపేట, సత్తెనపల్లి మున్సిపాలిటీల్లోనూ వైసీపీ అభ్యర్థుల పేర్లు ఇంకా తెరపైకి రాకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఒకవైపు 'టీడీపీ'లో పోటీకి ఉత్సాహం వెల్లువెత్తుతుండగా.. మరోవైపు 'వైసీపీ'లో అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీంతో స్థానిక ఎన్నికల బరిలో వైసీపీకి గట్టి సవాలు కానుందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.