Politics8th Nov 03:56 PMSunil Byrisetty1 min read

ఎన్నికల విజయాలు కూటమి ఐక్యతకు నిదర్శనం

కోనసీమ జిల్లా కూటమి నాయకులు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలు నాయకులు, కార్యకర్తల సమిష్

ఎన్నికల విజయాలు కూటమి  ఐక్యతకు నిదర్శనం
కోనసీమ జిల్లా కూటమి నాయకులు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలు నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషికి, పరస్పర సమన్వయానికి, ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా ప్రతిబింబించాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనం స్పష్టంగా కనిపించిందని, ప్రజల ఆదరణతో లభించిన విజయాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయని తెలిపారు. ఇదే ఐక్యత, సమన్వయం, పట్టుదలతో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవ విజయాలు సాధించడంతో పాటు, ఎన్నికలు జరిగే స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందనే నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి పేర్కొన్నారు.
Scroll for the next article