National12th Aug 01:56 PMSunil Byrisetty1 min read
జస్టిస్ వర్మ అభిశంసనపై ముగ్గురు సభ్యుల ప్యానల్
జస్టిస్ వర్మ అభిశంసనపై ముగ్గురు సభ్యుల ప్యానల్ ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ప్యానల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస
జస్టిస్ వర్మ అభిశంసనపై ముగ్గురు సభ్యుల ప్యానల్ ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ప్యానల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య ఉన్నారు. ముగ్గురు సభ్యులతో ప్యానల్ను లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని లోకసభ స్పీకర్ స్వీకరించారు. 146 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని స్పీకర్ స్వీకరించారు. తన నివాసంలో భారీ మొత్తంలో సొమ్ము బయటపడిన కేసులో ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.