News22nd Jul 12:06 PMSunil Byrisetty1 min read
మోడల్ నియోజకవర్గంగా మంగళగిరి
మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని ఐటీ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే అన్నారు. వందపడకల ఆసుపత్రి, గ్రామాల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు అ
మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని ఐటీ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే అన్నారు. వందపడకల ఆసుపత్రి, గ్రామాల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు అభివృద్ధి చేస్తున్నానన్నారు. రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మిత్రుల సహకారంతో, సిఎస్ఆర్ నిధుల ద్వారా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. వ్యవస్థను మెరుగుపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నియోజకవర్గం అంతటా చేయాలంటే 1800 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కేంద్రంతో సంప్రదించి చాలెంజ్ ఫండ్ నుంచి నిధులు తెచ్చి, రాష్ట్రప్రభుత్వ మ్యాచింగ్ నిధులు కలిపి భూగర్భ డ్రైనేజి పనులు ప్రారంభించామని వివరించారు. తాగునీరు, పైప్ లైన్ గ్యాస్, వందపడకల ఆసుపత్రి, మహానాడు రిటైనింగ్ వాల్ పనులు కూడా ప్రారంభిస్తున్నామన్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.