News28th Oct 12:32 PMSunil Byrisetty1 min read

లోకేష్ చైర్మన్‌గా డేటా సెంటర్ సలహా మండలి

ఆంధ్రప్రదేశ్‌ను, ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్నిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగానికి అవసరమైన డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2

లోకేష్ చైర్మన్‌గా డేటా సెంటర్ సలహా మండలి
ఆంధ్రప్రదేశ్‌ను, ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్నిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగానికి అవసరమైన డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2030 నాటికి 6,000 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా 'డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్'ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ మండలికి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గూగుల్ (1 గిగావాట్), సిఫీ ఇన్ఫినిటీ (550 మెగావాట్లు) వంటి దిగ్గజ సంస్థలు ప్రకటించిన భారీ పెట్టుబడులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయడమే ఈ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా విశాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రపంచ పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
Nara Lokesh
Data Center Advisory Council
Andhra Pradesh
Visakhapatnam
Artificial Intelligence
Digital Infrastructure
IT Department
Google Data Center
సిఫీ ఇన్ఫినిటీ
పెట్టుబడులు
ఉద్యోగావకాశాలు
టెక్ అభివృద్ధి
Scroll for the next article