News21st Sep 11:32 AMSunil Byrisetty1 min read

చిట్టి తల్లీ చదువుకో.. నేనున్నానన్న లోకేష్

"కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం నన్ను కదిలించింది. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు. అధికారులతో మాట్లాడాను. చ

చిట్టి తల్లీ చదువుకో.. నేనున్నానన్న లోకేష్
"కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం నన్ను కదిలించింది. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు. అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ! కేజీబీవీలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో! పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. మీరు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది. చక్కనైన యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు ఇస్తున్నాం. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. మనబడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. పిల్లల భద్రత -భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులను వేడుకుంటున్నాన"ని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్లో భరోసా ఇచ్చారు.
Andhra Pradesh
Lokesh
KGBV
Jessie
Education For All
Girl Child Education
Right To Education
School Admission
Child Welfare
Students Future
Education Matters
విద్య భరోసా
విద్యా సంక్షేమం
Scroll for the next article