News4th Oct 03:34 PMSunil Byrisetty1 min read
అభిమాని పెళ్లికి లోకేష్.. దంపతులు ఉద్వేగం
తమ పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించిన లోకేష్ అకస్మాత్తుగా వారి ఇంట ప్రత్యక్షం కావడంతో ఆ అభిమాని నోట మాటరాలేదు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ (భవ్య
తమ పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించిన లోకేష్ అకస్మాత్తుగా వారి ఇంట ప్రత్యక్షం కావడంతో ఆ అభిమాని నోట మాటరాలేదు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ (భవ్య) అనే యువతి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలిపింది. యువగళం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య.. తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానపత్రిక పంపించారు. శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో భవ్య వివాహం జరగనుంది. బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ మంత్రి లోకేష్ శనివారం మధ్యాహ్నం మొగల్రాజపురంలోని తన అభిమాని భవ్య ఇంటికి వెళ్లి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు.