Notifications17th Jul 04:53 PMSunil Byrisetty1 min read
పారదర్శకంగా అధ్యాపక పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలు, వైస్ చాన్సలర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అసోసియేట్, అసిస
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలు, వైస్ చాన్సలర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి, భర్తీ ప్రక్రియలో ఎటువంటి ఉల్లంఘనలు, ఆరోపణలు తలెత్తినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో అధ్యాపక పోస్టుల కోసం 1,90,509 అప్లికేషన్లు రాగా, వాటిలో 1,51,836 దరఖాస్తులు అర్హమైనవిగా నిర్థారించినట్లు అధికారులు తెలిపారు. ఎలిజిబిలిటీకి సంబంధించి గ్రీవెన్స్ ను ఈనెల 21వతేదీ వరకు స్వీకరించి, 27వతేదీన అర్హుల తుదిజాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూ ప్రక్రియను సైతం పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా చూడాలి, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రైవేటు యూనివర్సిటీల అనుమతులకు సంబంధించి విధివిధానాలు, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సెట్ల నిర్వహణ పురోగతిపై చర్చిస్తూ.. సకాలంలో అడ్మిషన్లు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.