News9th Nov 10:58 AMSunil Byrisetty1 min read
రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశాభివృద్ధి
రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో
రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. "దేశప్రజలు ప్రధానిగా సరైన సమయంలో సరైన నేతను ఎన్నుకున్నారు. దీంతో గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా బీహార్ కూడా నితీష్ కుమార్ కు ముందు, తర్వాత అన్నవిధంగా అభివృద్ధి సాధించింది. సమర్థవంతమైన నాయకుడివల్లే బీహార్ అభివృద్ధి సాధిస్తోంది. లీడర్ షిప్ ట్రాక్ రికార్డుతోపాటు శాంతిభద్రతలు, మహిళల భద్రత, అవినీతి రహిత పాలనే ఇందుకు కారణం. కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాల విషయంలో ఎపి, బీహార్ లకు సారూప్యతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బులెట్ సర్కారు కారణంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. చిన్న రాష్ట్రమైనప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లే మా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయ"ని వివరించారు.