News15th Jul 01:10 PMSunil Byrisetty1 min read

దాల్మియా ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష శంకుస్థాపన

కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా దాల్మియా సిమెంట్ భా

దాల్మియా ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష శంకుస్థాపన
కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించారు. ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు. కార్మికులను పలకరించి వారితో కలిసి సెల్ఫీ దిగారు. అనంతరం పునీత్ దాల్మియాతో కలిసి దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్-2 విస్తరణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్-2 విస్తరణను రూ.3,100 కోట్ల వ్యయంతో చేపట్టనుంది. మైలవరం మండలంలోని చిన్నకొమెర్లలో ప్లాంటులో దాల్మియా సిమెంట్ ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోంది. కొత్తప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్లాంట్ విస్తరణతో కొత్తగా 1000 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది.
Andhra Pradesh
Nara Lokesh
Dalmia Bharat
Dalmia Cement
Kadapa
Cement Plant
పారిశ్రామికాభివృద్ధి
పెట్టుబడులు
ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article