News26th May 01:43 PMSunil Byrisetty1 min read
మహానాడు వేదికగా.. లోకేశ్‌కి పట్టాభిషేకం!?
ఏపీలో కూటమి గెలుపు తర్వాత టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీ నిర్వహిస్తున్న తొలి మహానాడులో కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. టీడీ
ఏపీలో కూటమి గెలుపు తర్వాత టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
ఎన్నికల్లో విజయం తర్వాత టీడీపీ నిర్వహిస్తున్న తొలి మహానాడులో కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పార్టీలో కీలక పదవీ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడి (వర్కింగ్ ప్రెసిడెంట్)గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని పార్టీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై ఒత్తిడి వస్తోంది. ఈనెల 27, 28, 29తేదీల్లో కడపలో జరిగే మహానాడులో ఆయనకు కొత్త బాధ్యతల అప్పగింతపై సీఎం చంద్రబాబు చర్చించి నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉండగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన తనయుడు కేటీఆర్ కొనసాగుతున్నారు.
అదే విధంగా ఏపీలో టీడీపీలో ప్రకటిస్తారని చర్చలు జరుగుతున్నాయి