News1st Aug 12:34 PMSunil Byrisetty1 min read

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ... అర్థమైందా రాజా

`కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడి ప్రజలను అవమానించిన‌ వాళ్లకి ఈరోజు దిమ్మ తిరిగే సమాధాన‌మే అల్లూరి సీతారామ‌రాజు అ

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ... అర్థమైందా రాజా
`కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడి ప్రజలను అవమానించిన‌ వాళ్లకి ఈరోజు దిమ్మ తిరిగే సమాధాన‌మే అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్సవం. ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చింది. ఎర్రబస్సు రాదు అన్నచోటకి ఎయిర్ బస్ వచ్చింది. ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఏకంగా మన నమో వచ్చారు. ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ… అర్దమైందా రాజా..’ అంటూ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తేజ‌భ‌రితంగా ప్ర‌సంగించారు. భోగాపురం అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్సవ సభలో ప్రధాని న‌రేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన నమో గారి వికసిత్ భారత్, మన సీబీఎన్ గారి విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు అని వ్యాఖ్యానించారు.
North Andhra
Nara Lokesh
Bhogapuram International Airport
Narendra Modi
N Chandrababu Naidu
పవన్ కళ్యాణ్
అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం
ఆంధ్రప్రదేశ్
రాజకీయాలు
Scroll for the next article