News31st Dec 02:52 PMSunil Byrisetty1 min read

2025పై మంత్రి లోకేష్ మార్క్!

మంత్రి నారా లోకేష్ గతానికి భిన్నంగా పాలనలో తనదైన మార్క్ చూపించారు. ఈ ఏడాది మొత్తం ప్రభుత్వ పాలనను గమనిస్తే లోకేష్ కేంద్రంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాఖలతో సంబంధం లేకుండా ద

2025పై మంత్రి లోకేష్ మార్క్!
మంత్రి నారా లోకేష్ గతానికి భిన్నంగా పాలనలో తనదైన మార్క్ చూపించారు. ఈ ఏడాది మొత్తం ప్రభుత్వ పాలనను గమనిస్తే లోకేష్ కేంద్రంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాఖలతో సంబంధం లేకుండా దాదాపు అన్ని అంశాలను ఆయన దృష్టిలో పెట్టుకొని స్పందించాల్సిన సమయంలో కచ్చితంగా స్పందించారు. మెగా పేరెంట్‌ మీటింగ్స్(పీటీఎం) ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఇది ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్‌ను అందించింది. అలాగే విదేశాలకు వెళ్లి పెట్టుబడుల‌ను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ కల్పన ఉపాధి కల్పనకు పెద్దపీట వేయగలిగారు. పార్టీ కార్యాలయానికి తరచుగా వెళ్లడం.. నాయకులతో భేటీ కావడం.. సమస్యలు పరిష్కరించేదిశ‌గా అడుగులు వేయడం.. సీనియర్లకు కూడా కొన్ని విషయాల్లో హెచ్చరికలు జారీ చేయడం వంటివి పార్టీకి కలిసి వచ్చిన అంశాలుగా మారాయి. ప్రజలకు చేరువ అయ్యే విషయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు.
Andhra Pradesh
Nara Lokesh
2025 Governance
TDP Government
Education Reforms
Mega Parent Meetings
పెట్టుబడుల ఆహ్వానం
ఉద్యోగ కల్పన
ప్రజలతో అనుసంధానం
నాయకత్వ శైలి
Scroll for the next article