News28th Sep 11:00 AMSunil Byrisetty1 min read
లోకేష్ చొరవతో 372 మందికి శాశ్వత ఆస్తి హక్కు
కుంచనపల్లిలో ‘మన ఇల్లు-మన లోకేష్' కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరిలో పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములకు పట్టాలు, 372 మందికి శ
కుంచనపల్లిలో ‘మన ఇల్లు-మన లోకేష్' కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరిలో పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములకు పట్టాలు, 372 మందికి శాశ్వత ఆస్తి హక్కు పత్రాలు అందజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 80 శాతం పట్టాల సమస్య పరిష్కారమైందని తెలిపారు. నేను 53 వేల మెజార్టీ అడిగితే.. 93 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారని పేర్కొన్నారు. పట్టాల సమస్యను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని, త్వరలో విజయవాడలో 24 వేల ఇంటి పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు. మంగళగిరిలో త్వరలో 100 పడకల ఆస్పత్రిని పూర్తి చేస్తామన్నారు. 2029లోపు మంగళగిరిలో గ్యాస్, తాగునీరు, భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ ఇస్తామన్నారు.