Health24th Sep 01:32 PMSunil Byrisetty1 min read
ఎయిమ్స్‌లో రక్త పరీక్షలకు క్యూ!
ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థగా సేవలందిస్తున్న ఎయిమ్స్ మంగళగిరిలో రక్త పరీక్షల కోసం రోగులు నిరీక్షించాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళల్లో రోగ
ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థగా సేవలందిస్తున్న ఎయిమ్స్ మంగళగిరిలో రక్త పరీక్షల కోసం రోగులు నిరీక్షించాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళల్లో రోగుల రద్దీ పెరగడంతో రక్త నమూనాల సేకరణ కేంద్రాల వద్ద క్యూ ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన కుటుంబ సభ్యులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడం ఇబ్బందికరంగా మారుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే వైద్యుల కోసం నిరీక్షించిన రోగులకు రక్త పరీక్షల వద్ద కూడా సమయం పడుతుండటంతో అసౌకర్యం ఎదురవుతోందని అంటున్నారు. అత్యవసర విభాగానికి వచ్చిన రోగులకు పరిస్థితికి అనుగుణంగా పరీక్షలు త్వరగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ ల్యాబొరేటరీలో అవసరమైన సమయంలో సిబ్బంది అందుబాటుపై కూడా కొందరు రోగుల బంధువులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనివల్ల అత్యవసర పరీక్షల విషయంలో జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.