News8th Aug 03:54 PMSunil Byrisetty1 min read

ఐదేళ్ల చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పిన శక్తి టీం

సరిగా తన కన్నవారి పేరు, వివరాలు చెప్పలేని ఐదు సంవత్సరాల ఒక చిన్నారి అమ్మమ్మ ఇంటి నుంచి నడుచుకుంటూ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని బయలుదేరింది. రోడ్డుపై అటు ఇటు తిరుగుతుండడాన్ని అక

ఐదేళ్ల చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పిన శక్తి టీం
సరిగా తన కన్నవారి పేరు, వివరాలు చెప్పలేని ఐదు సంవత్సరాల ఒక చిన్నారి అమ్మమ్మ ఇంటి నుంచి నడుచుకుంటూ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని బయలుదేరింది. రోడ్డుపై అటు ఇటు తిరుగుతుండడాన్ని అక్కడే ఉన్న శక్తి టీం సిబ్బంది గుర్తించి ఆ పాప వద్దకు వెళ్లి వివరాలు అడిగి తన తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులి రామారావు నగర్ కి చెందిన భాస్కర్, వరలక్ష్మి క్క కుమార్తె లోడే లలితను పెనమలూరులోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచారు. ఆ పాప వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి సుమారు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ కంకిపాడు రోడ్డుపై వెళ్తూ ఉండడాన్ని శక్తి టీం సిబ్బంది ఉదయ్ కిరణ్, బేబీ, సామ్రాజ్యం గమనించి దగ్గరకు వెళ్లి విచారించారు. తన ఊరు కంకిపాడు అని చెప్పడంతో కంకిపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. పాప చెప్పిన వివరాలు నిర్ధారణ చేసుకున్న పిమ్మట పాపను కంకిపాడు ఇన్స్పెక్టర్ J.మురళీకృష్ణ, ఎస్సైలు సందీప్, తాతాచార్యులు సమక్షంలో సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
Andhra Pradesh
Missing Child
Child Rescue
Shakti Team
Kankipadu Police
Penamaluru
Child Safety
Bhaskar Varalakshmi
Lodde Lalitha
చిన్నారి రక్షణ
తప్పిపోయిన పిల్ల
శక్తి టీం
Scroll for the next article