News13th Jul 11:13 AMSunil Byrisetty1 min read

మోసపోయారా.. మీకోసం 'సచేత్' ఉంది!

నకిలీ లేదా మోసపూరిత పెట్టుబడి పథకాల బారినపడి ఆర్థికంగా నష్టపోయిన వారికి ఆర్‌బీఐ భరోసా కల్పించేలా సూచనలు చేసింది. ఆర్థిక మోసాలకు గురైన వారు ఆర్‌బీఐ రూపొందించిన 'సచేత్ (Sachet)' పోర్

మోసపోయారా.. మీకోసం 'సచేత్' ఉంది!
నకిలీ లేదా మోసపూరిత పెట్టుబడి పథకాల బారినపడి ఆర్థికంగా నష్టపోయిన వారికి ఆర్‌బీఐ భరోసా కల్పించేలా సూచనలు చేసింది. ఆర్థిక మోసాలకు గురైన వారు ఆర్‌బీఐ రూపొందించిన 'సచేత్ (Sachet)' పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక సందేశాలను పంపుతోంది. సచేత్ పోర్టల్‌లో నమోదు చేసిన ఫిర్యాదులను సంబంధిత సంస్థలు, అమలు చేయాల్సిన సంస్థలకు పంపించి తగిన చర్యలు తీసుకునేలా చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. అనధికారిక డిపాజిట్ పథకాలు, నకిలీ పెట్టుబడి సంస్థలు, అధిక లాభాల పేరుతో మోసాలకు పాల్పడే సంస్థలపై బాధితులు ఈ వేదిక ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఇటీవల సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో "తక్కువ సమయంలో భారీ లాభాల" పేరిట చేస్తున్న మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ చట్టబద్ధతను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ఊహించని రాబడులు ఇస్తామనే మాటలను నమ్మవద్దని హెచ్చరించింది. అలాంటి వాటిపై https://sachet.rbi.org.in పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని సూచించింది.
RBI
Sachet Portal
Investment Scam
Financial Fraud
Online Scam
Fake Investment
RBI Sachet
Cyber Fraud
ఆర్‌బీఐ సచేత్
ఫిర్యాదు
అనధికారిక డిపాజిట్ పథకాలు
పెట్టుబడులు
ఆర్థిక భద్రత
Scroll for the next article