News31st Dec 12:03 PMSunil Byrisetty1 min read
'స్టాక్ మార్కెట్' లాంటివే.. ప్రేమ పెళ్లిళ్లు!
ప్రేమ పెళ్లిళ్లు 'స్టాక్ మార్కెట్' లాంటివని ఒక న్యాయస్థానం వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది. ప్రేమ వివాహాలలు 'స్టాక్ మార్కెట్' లాంటివని మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఆసక్తికర వ్య
ప్రేమ పెళ్లిళ్లు 'స్టాక్ మార్కెట్' లాంటివని ఒక న్యాయస్థానం వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది. ప్రేమ వివాహాలలు 'స్టాక్ మార్కెట్' లాంటివని మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాటిలో లాభనష్టాలు, ఒడిదుడుకులు సర్వసాధారణమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి గత నెలలో అకస్మాత్తుగా అదృశ్యమైంది. తన కుమార్తె కిడ్నాప్‌కు గురైందని అనుమానిస్తూ ఆమె తండ్రి కరుప్పన్నన్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సదరు యువతి.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనతో పాటు పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిని ఇష్టపడి వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది. అయితే, ఆ యువతి మేజర్ అని, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నందున ఆమె నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. భర్తతో వెళ్లేందుకు యువతికి అనుమతినిస్తూ కేసును మూసివేసింది.