News26th Sep 11:40 AMSunil Byrisetty1 min read
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. హోంమంత్రి అలర్ట్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో హోం మంత్రి అనిత కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులన
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో హోం మంత్రి అనిత కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి అని ఆదేశించారు. ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సహాయక చర్యలకు NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉంచాలని అనిత పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదన్నారు.