News25th Aug 09:18 AMSunil Byrisetty1 min read

బార్ లైసెన్స్.. దరఖాస్తుదారులు సైలెన్స్!

ఏపీలో బార్ లైసెన్సుకు స్పందన కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు లైసెన్స్‌లు ఇవ్వడానికి నోటిఫికేషన్‌ జారీచేస్తే.. ఈ వారం రోజుల్లో కేవలం 30 దరఖాస్తులే వచ్చాయి. దరఖాస్తులు సమర్పి

బార్ లైసెన్స్.. దరఖాస్తుదారులు సైలెన్స్!
ఏపీలో బార్ లైసెన్సుకు స్పందన కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు లైసెన్స్‌లు ఇవ్వడానికి నోటిఫికేషన్‌ జారీచేస్తే.. ఈ వారం రోజుల్లో కేవలం 30 దరఖాస్తులే వచ్చాయి. దరఖాస్తులు సమర్పించేందుకు మంగళవారం చివరి రోజు. రేపటి వరకే గడువున్నా వ్యాపారుల్లో పెద్దగా స్పందన కనిపించకడం లేదు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు కొత్త పాలసీ విఫలమవుతుందా అని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో 13, కర్నూలు-1, నంద్యాల-1, ఎన్టీఆర్‌-7, పల్నాడు-1, ప్రకాశం-3, తిరుపతి-1, విజయనగరం-1, కడప జిల్లాలో రెండు వచ్చాయి. వీటిలోనూ నాలుగు దరఖాస్తులు వచ్చిన బార్లు రెండే ఉన్నాయి. నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తీయరు. అంటే లాటరీ తీయదగిన స్థాయిలో దరఖాస్తులు అందింది కేవలం రెండు బార్లకు మాత్రమే. 840 బార్లకు లాటరీ తీయాలంటే మొత్తం 3,360 దరఖాస్తులు రావాలి. అది కూడా ప్రతి బార్‌కు నాలుగు చొప్పున దరఖాస్తులు అందాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చివరికి సగం బార్లకైనా వస్తాయా అనే అనుమానం కలుగుతోంది.
Andhra Pradesh
Bar Licenses
Excise Department
Liquor Policy
Business Response
Bar License Lottery
AP Excise Policy
License Applications
Bars in AP
Government Notification
ఎక్సైజ్ పాలసీ విఫలం
బార్ టెండర్లు
లైసెన్స్ దరఖాస్తులు
Scroll for the next article