News30th Dec 03:23 PMSunil Byrisetty1 min read
వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇళ్లకు డిమాండ్
బ్యాంకింగ్ రంగం గృహ రుణ గ్రహీతలకు వడ్డీ తగ్గింపు కబురు అందించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించడమే కాకుండా ఆఫర్లను ప్రకటించాయి. ప్రాసెసి
బ్యాంకింగ్ రంగం గృహ రుణ గ్రహీతలకు వడ్డీ తగ్గింపు కబురు అందించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించడమే కాకుండా ఆఫర్లను ప్రకటించాయి. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, తక్కువ వడ్డీ, మహిళా రుణ గ్రహీతలకు అదనపు రాయితీలు మధ్యతరగతి ప్రజలను ఇళ్ల కొనుగోలు వైపు ఆకర్షిస్తున్నాయి.
ఇయర్ ఎండ్ ఆఫర్ల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై కనిపిస్తోంది. నెల రోజుల్లో దేశవ్యాప్తంగా మధ్యతరగతి ఇళ్ల అమ్మకాలు 10 శాతం వృద్ధి చెందాయి. అద్దె ఇళ్లలో ఉండేవారు, వడ్డీ రేట్లు తగ్గడం వల్ల వచ్చే ఈఎంఐ భారం అద్దెతో సమానంగా ఉంటుందని భావించి సొంత ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కేవలం మెట్రో నగరాల్లోనే కాకుండా, టైర్-2 నగరాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.