News12th Sep 12:16 PMSunil Byrisetty1 min read

దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం!

దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగం

దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం!
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. నేడు శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఐఎండీ విడుదల చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అయితే విజయవాడ, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం పడింది. అనంతరం చినుకులు పడుతూనే ఉన్నాయి.
Andhra Pradesh Weather
Low Pressure Area
South Odisha
North Andhra Coast
IMD Weather Alert
Heavy Rainfall
Srikakulam Rain
Vijayawada Rain
మత్స్యకారులకు హెచ్చరిక
కోస్తాంధ్ర
విపత్తుల నిర్వహణ
ఏపీ వర్షాలు
వాతావరణ సూచన
Scroll for the next article