News29th Oct 01:43 PMSunil Byrisetty1 min read

మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు?

దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, ఆనుకుని

మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు?
దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న అండమాన్ & నికోబార్ దీవులపై సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం,అండమాన్ సముద్ర ప్రాంతాలపై వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 1, 2 తేదిల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తులను నిర్వహణ సంస్థ పేర్కొంది. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుందని తెలిపింది.
Scroll for the next article