News13th Apr 01:21 PMSunil Byrisetty1 min read

విశాఖలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!

విశాఖలో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. LTW పేరుతో కొనసాగుతున్న ఐటీ కంపెనీ హఠాత్తుగా తట్టాబుట్టా సర్దేశింది. దీంతో 150 మందికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత పది నెల

విశాఖలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!
విశాఖలో ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. LTW పేరుతో కొనసాగుతున్న ఐటీ కంపెనీ హఠాత్తుగా తట్టాబుట్టా సర్దేశింది. దీంతో 150 మందికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత పది నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. సంస్థ యాజమాన్యం నిబంధనలు తుంగలోకి తొక్కి, పీఎఫ్‌లు కూడా చెల్లించలేదని తెలుస్తోంది. అంతే కాకుండా ఫేక్ ఇన్వాయిస్‌లు, నకిలీ ఆఫర్ లెటర్స్‌తో మోసం చేశారంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ బోగస్ కంపెనీ మోసంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు
Visakhapatnam
LTW IT BPO Software Company
Cheating To Employees
నకిలీ ఆఫర్ లెటర్స్‌
బోగస్ కంపెనీ
ఫేక్ ఇన్వాయిస్‌
Scroll for the next article