TTD28th Aug 12:54 PMSunil Byrisetty1 min read
7న చంద్రగ్రహణం.. శ్రీవారి ఆర్జిత సేవల రద్దు
చంద్ర గ్రహణం కారణంగా టీటీడీ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబరు 7వ తేదీన ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజు సాయంత్రం 3.30 గంటల నుంచి మరు
చంద్ర గ్రహణం కారణంగా టీటీడీ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబరు 7వ తేదీన ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజు సాయంత్రం 3.30 గంటల నుంచి మరుసటి రోజు (సెప్టెంబరు 8) తెల్లవారుజామున మూడు గంటల వరకు స్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవాచనం నిర్వహించనున్నారు. తోమాలసేవ, కొలువు, పంచాగ శ్రవణం, అర్చన ఏకాంతంగా నిర్వహించాక ఉదయం ఆరు గంటలకు శ్రీవారి దర్శనం పునఃప్రారంభమవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.