News13th Aug 05:17 PMSunil Byrisetty1 min read

మచిలీపట్నం తీరంలో 63 అడుగుల ‘విజయ గణపతి’

అనుకున్న పనులన్నీ విఘ్నాల్లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలనే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం సాగర తీరంలో 63 అడుగుల భారీ మట్టి ‘విజయ గణపతి’ విగ్రహాన్ని అంగరంగ వైభ

మచిలీపట్నం తీరంలో 63 అడుగుల ‘విజయ గణపతి’
అనుకున్న పనులన్నీ విఘ్నాల్లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలనే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం సాగర తీరంలో 63 అడుగుల భారీ మట్టి ‘విజయ గణపతి’ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించబోతున్నారు. ఎంతో ఉజ్జ్వల చరిత్ర కలిగిన మచిలీపట్నం కాలక్రమేణా అనేక ఒడిదుడుకులకు గురై అభివృద్ధికి దూరమైందని ‘మంగినపూడి సాగర తీర మహా గణపతి ఉత్సవ సేవా సమితి’ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. బందరుకు మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసి, సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించేందుకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నిరంతరం తపన పడుతున్నారని కొనియాడారు. నగర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ, పర్యావరణ పరిరక్షణను సైతం దృష్ట్యాలో ఉంచుకుని మంగినపూడి బీచ్‌లో 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రి చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు.
Andhra Pradesh
Machilipatnam
Manginapudi Beach
Vijaya Ganapati
Ganesh Chaturthi
Lord Ganesha
Ganapati Idol
63 Feet Ganapati
పర్యావరణ హిత గణపతి
ఆంధ్రప్రదేశ్
కొల్లు రవీంద్ర
గణేష్ ఉత్సవాలు
సాగర తీరం
పర్యావరణ పరిరక్షణ
Scroll for the next article