News30th Jul 01:02 PMSunil Byrisetty1 min read
ఇండియన్ నేవీలోకి మచిలీపట్నం!
భారత నేవీలోకి మరో యుద్ధ నౌక ప్రవేశించింది. సువిశాల తీరప్రాంత రక్షణలోకి ‘మచిలీపట్నం’ చేరింది. పురాతన నౌకాశ్రయమైన మచిలీపట్నం పేరును యుద్ధ నౌకకు పెడుతూ మన నావికాదళం నిర్ణయం తీసుకోవడంప
భారత నేవీలోకి మరో యుద్ధ నౌక ప్రవేశించింది. సువిశాల తీరప్రాంత రక్షణలోకి ‘మచిలీపట్నం’ చేరింది. పురాతన నౌకాశ్రయమైన మచిలీపట్నం పేరును యుద్ధ నౌకకు పెడుతూ మన నావికాదళం నిర్ణయం తీసుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 'మచిలీపట్నం' పేరిట రూపొందించిన ఈ ఆధునిక సబ్‌మెరైన్ విధ్వంసక నౌకను వైభవంగా ప్రారంభించారు. కృష్ణా జిల్లాకు చెందిన చారిత్రక నౌకాశ్రయం 'మచిలీపట్నం'. ఆ పేరును ఒక యుద్ధనౌకకు పెట్టడం మన రాష్ట్రానికే కాక తెలుగువారందరికీ గర్వకారణం. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసలు వ్యక్తం చేశారు. గేట్ వే ఆఫ్ అమరావతిగా నిర్మితమవుతున్న 'మచిలీపట్నం పోర్టు' పేరుతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ ఓ భారీ జలాంతర్గామి విధ్వంసక నౌకను నిర్మించడం హర్షణీయమని కొనియాడారు.