News28th Jun 04:58 PMSunil Byrisetty1 min read

బందరును బాగు చేయడమే లక్ష్యం

మచిలీపట్నం నగరంలో ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం 165 కోట్ల రూపాయల ఖర్చుతో మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని గనులు, భ

బందరును బాగు చేయడమే లక్ష్యం
మచిలీపట్నం నగరంలో ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం 165 కోట్ల రూపాయల ఖర్చుతో మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మునిసిపల్ కార్యాలయం పక్కనే 35.16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ పురపాలక సంఘ కార్యాలయం పక్కనే ఉన్న రహదారి దాదాపు 10 డివిజన్లకు వెళ్లే అతి ముఖ్యమైన రహదారన్నారు. ఆ రహదారి గత పాలకుల నిర్లక్ష్యం వలన ఆక్రమణలకు గురై ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగిందన్నారు. ముఖ్యంగా ఆడబిడ్డలు చాలా ఇబ్బందులు పడేవారన్నారు. మురుగునీటి కాలువల పైన ఆక్రమణలు ఎక్కువగా ఉండటంతో ఎప్పుడు వర్షం కురిసిన బందరు రహదారులు మురుగునీటితో నిండి ఉంటాయనే అపోహలు ఉన్నాయని, వాటిని పోగొట్టేలా తాము పనులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
Andhra Pradesh news
Vijayawada
Bandar
Minister Kollu Ravindra
మునిసిపల్ కార్యాలయం
మురుగునీటి కాలువ నిర్మాణం
Scroll for the next article