Spiritual22nd Sep 12:01 PMSunil Byrisetty1 min read

మచిలీపట్నం సాగర తీర మహా గణపతికి అంతర్జాతీయ గుర్తింపు

మచిలీపట్నం సాగర తీర మహా గణపతికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ 'అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో 63 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మహా గణపతి చోటు దక్కించుకుంది. సంస్థ ప్రతినిధులు

మచిలీపట్నం సాగర తీర మహా గణపతికి అంతర్జాతీయ గుర్తింపు
మచిలీపట్నం సాగర తీర మహా గణపతికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ 'అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో 63 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మహా గణపతి చోటు దక్కించుకుంది. సంస్థ ప్రతినిధులు మంత్రి కొల్లు రవీంద్రకు అవార్డును అందజేశారు. సాగరతీర మహా గణపతికి అంతర్జాతీయ గుర్తింపు ఎంతో అదృష్టమని భక్తులు చెబుతున్నారు. వినాయక చవితి రోజు మంగినపూడి బీచ్ ఒడ్డున 63 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మహా గణపతిని మంత్రి కొల్లు ప్రతిష్టించారు. లక్ష ఇళ్లనుంచి సేకరించిన మట్టితో మహా గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. విశిష్ట పూజలతో ఎకో ఫ్రెండ్లీ మహా గణపతి ప్రజల దృష్టి ఆకర్షించింది.
Scroll for the next article