News31st Oct 05:30 PMSunil Byrisetty1 min read
మేడిన్ ఆంధ్రా.. ముంబైలో పరుగు
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో అత్యంత కీలకమైన మెట్రో (వడాలా – కాసర్వడవలి ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన అత్యాధునిక డ్రైవర్‌లెస్ మెట్రో రైలు తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఫ్రాన్స్ దిగ్
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో అత్యంత కీలకమైన మెట్రో (వడాలా – కాసర్వడవలి ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన అత్యాధునిక డ్రైవర్‌లెస్ మెట్రో రైలు తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఫ్రాన్స్ దిగ్గజ సంస్థ ఆల్‌స్టోమ్ ప్లాంట్‌లో విజయవంతంగా రూపుదిద్దుకుంది. మొత్తం 39 ఆరు కోచ్‌ల రైళ్ల కాంట్రాక్ట్‌లో భాగంగా.. మొదటి రైలు సెట్‌ను ఒప్పందం కుదిరిన కేవలం 14 నెలల రికార్డు వ్యవధిలోనే సిద్ధం చేసి శ్రీసిటీ యూనిట్‌లో ప్రతినిధులు అధికారికంగా ఆవిష్కరించారు. ఎల్ అండ్ టీ, ఆల్‌స్టోమ్ సంస్థల భాగస్వామ్యంతో పక్కా ఇంజనీరింగ్ ప్రణాళికతో ఈ మెట్రోపాలిస్ రైళ్లను తీర్చిదిద్దారు. ఈ సరికొత్త రైళ్లు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 35.3 కిలోమీటర్ల గ్రీన్ లైన్ కారిడార్‌లో ప్రయాణించనున్నాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిగ్నలింగ్ సాంకేతికత ఆధారంగా నడిచే ఈ డ్రైవర్‌లెస్ వ్యవస్థ ద్వారా.. పీక్ అవర్స్‌లో కేవలం 90 సెకన్ల వ్యవధిలోనే ఒకదాని వెనుక మరొక రైలు అత్యంత సురక్షితంగా నడిచే వెసులుబాటు కలగనుంది. అత్యాధునిక సెన్సార్లు, కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించే ఈ మేడ్ ఇన్ ఏపీ కోచ్‌లు ముంబై నగర ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనున్నాయి.