News9th Jul 03:33 PMSunil Byrisetty1 min read
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మాధవ్ మాట్లాడుతూ.. తన కంటే ముందు అధ్యక్షులైన
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మాధవ్ మాట్లాడుతూ.. తన కంటే ముందు అధ్యక్షులైన వారి శక్తియుక్తులతో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పని చేస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పుష్ప మాల వేసి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి బయలుదేరారు. విజయవాడలోని లెనిన్ సెంటర్‌ను ఇక నుంచి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సెంటర్‌గా పిలవాలని కోరారు.