News11th Dec 02:56 PMSunil Byrisetty1 min read

అటల్- మోదీ యాత్రకు మధ్యప్రదేశ్ సీఎం.. ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయ్ గారి 100వ జయంతిని పురస్కరించుకొని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో యాత్రను ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగ

అటల్- మోదీ యాత్రకు మధ్యప్రదేశ్ సీఎం.. ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయ్ గారి 100వ జయంతిని పురస్కరించుకొని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో యాత్రను ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటల్- మోదీ సుపరిపాలన బస్సు యాత్ర కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచ్చేశారు. ఆయనకి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్ సత్య కుమార్ యాదవ్, బిజెపి శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాజ్ పేయ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, జనసేన నేతలు పాల్గొన్నారు.
Andhra Pradesh
Atal Bihari Vajpayee
Atal–Modi Yatra
BJP
Madhya Pradesh CM Mohan Yadav
Dharmavaram
టీడీపీ
జనసేన
రాజకీయాలు
బస్సు యాత్ర
అటల్ బిహారి వాజ్‌పేయి
Scroll for the next article