Politics4th Oct 09:49 AMSunil Byrisetty1 min read

విజయ్‌కు షాక్.. సీబీఐ కాదు సిట్ దర్యాప్తు !

టీవీకే పార్టీ అధినేత, తమిళ నటుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్ర అంటూ ఆయన పార్టీ తరపున దాఖలు చేసిసిన పిటిషన్ ను తోసిపుచ్

విజయ్‌కు షాక్.. సీబీఐ కాదు సిట్ దర్యాప్తు !
టీవీకే పార్టీ అధినేత, తమిళ నటుడు విజయ్‌కు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్ర అంటూ ఆయన పార్టీ తరపున దాఖలు చేసిసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. కనీస ఏర్పాట్లు లేకుండా సభను నిర్వహించడం ఏమిటని ప్రశ్నించింది. సరైన విధి విధానాలు రూపొందించే వరకూ అన్ని భారీ యాత్రలకు అనుమతులు ఇవ్వవొద్దని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీవీకే నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో ధర్మాసనం మరింత తీవ్రంగా స్పందించింది. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత టీవీకే నాయకులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించిది. ఇంత భారీ విషాదం జరిగిన తర్వాత బాధితుల్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. విజయ్ వాహనాన్ని అధికారులు ఎందుకు సీజ్ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ముందస్తు బెయిల్స్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Tamil Nadu Politics
Vijay
TVK Party
Madras High Court
Karur Stampede Case
SIT Investigation
CBI Probe Denied
Anticipatory Bail Rejected
రాజకీయ సభ విషాదం
కోర్టు ఆదేశాలు
సీబీఐ కాదు సిట్ దర్యాప్తు
Scroll for the next article