News5th Jul 03:15 PMSunil Byrisetty1 min read

డ్రైనేజీ వ్యవస్థలో గేమ్‌ చేంజర్‌గా మ్యాజిక్‌ డ్రైయిన్‌..

భూగర్భ జలాల పెంపు మురుగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘‘మ్యాజిక్‌ డ్రెయిన్‌’’ డ్రైనేజీ వ్యవస్థలో గేమ్‌ చేంజర్‌గా మారనున్నాయని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపార

డ్రైనేజీ వ్యవస్థలో గేమ్‌ చేంజర్‌గా మ్యాజిక్‌ డ్రైయిన్‌..
భూగర్భ జలాల పెంపు మురుగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘‘మ్యాజిక్‌ డ్రెయిన్‌’’ డ్రైనేజీ వ్యవస్థలో గేమ్‌ చేంజర్‌గా మారనున్నాయని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు. భూగర్భ జలాల పెంపు మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద వినూత్నంగా ప్రవేశ పెడుతున్న మ్యాజిక్‌ డ్రెయిన్‌ విధానాన్ని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ నందిగామ మండలం సోమవరం గ్రామంలో ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచాలన్న లక్ష్యంతో పాటు మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు మ్యాజిక్‌ విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. పారిశుధ్యం, భూగర్భ జలాల పునరుద్ధరణ మెరుగుపరుస్తూ మురుగునీటి దుర్వాసన, దోమల వ్యాప్తిని అరికట్టడం మ్యాజిక్‌ డ్రెయిన్‌ ప్రాజెక్ట్‌ లక్ష్యమన్నారు. సాంప్రదాయ కాంక్రీట్‌ ఛానల్‌ (సిసి) డ్రైనేజీ వ్యవస్థల మాదిరిగా కాకుండా నూతన పద్ధతయిన మ్యాజిక్‌ డ్రెయిన్‌ ద్వారా గృహాల నుండి విడుదలయ్యే మురుగునీరు ప్రత్యేకంగా రూపొందించిన కందకం ద్వారా నేరుగా భూమిలోకి చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంన్నారు. గ్రామాల్లో సరైన డ్రైనేజీ సదుపాయాలు లేక ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని తద్వారా ప్రజారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఖర్చుతో కూడుకున్న కాంక్రీట్‌ డ్రెయిన్‌ల నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా మ్యాజిక్‌ డ్రెయిన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Andhra Pradesh news
chandra babu
Construction of Magic Drain in All Districts
construction of drainages
collector G lakshmisha
కాలనీలో మ్యాజిక్‌ డ్రైన్‌ నిర్మాణం
Scroll for the next article